Sunday, June 2, 2024

డ్రోన్ల ద్వారా టీకా సరఫరా

- Advertisement -
- Advertisement -

ఆకాశం నుంచి ఔషధం
ప్రాజెక్టును చేపట్టిన స్కైవే మొబిలిటి
సరఫరాలో విప్లవం
కొవిడ్‌కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం : బ్లూడార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ బాల్ఫోర్ మాన్యెల్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్, మందుల పంపిణీ గురువారం ప్రారంభం కానుంది. మారుమూల ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ వేగంగా చేసేందుకు వీలుగా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టు పేరిట ఈ నెల 9 నుంచి 17 వరకు వికారాబాద్, హైదరాబాద్‌లలో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్, మందుల పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇండియన్ డ్రోన్ డెలివరీ స్టార్టప్ స్కై వే మొబిలిటీ, బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్‌తో కలిసి డ్రోన్ డెలివరీ ట్రయల్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బ్లూ డార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ బాల్ఫోర్ మాన్యెల్ మాట్లాడుతూ, కొవిడ్ 19కు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని, మనకు ఎదురవుతున్న కొత్త సవాళ్లను నిజమైన పరిష్కార మార్గాలు అవసరమని అన్నారు. దేశంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు త్వరితగతిన వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. స్కై వే మొబిలిటీ సహ వ్యవస్థాపకులు స్వప్నిక్ జక్కంపూడి మాట్లాడుతూ, రాష్ట్రంలో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న వ్యాక్సిన్ల డ్రోన్ డెలివరీలో భాగస్వామ్యమవుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు త్వరితగతిన వ్యాక్సిన్, మందులు సరఫరా చేసేందుకు ఎంతోగానో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
స్వల్ప వ్యవధిలో సరఫరా
డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యాక్సిన్లు, మందుల సరఫరా విధానం పూర్తిగా అందుబాటులోకి వస్తే స్వల్ప వ్యవధిలోనే వ్యాక్సిన్లు సరఫరా కానున్నాయి. జిల్లా కేంద్రాల్లో ఉండే ఔషధ నిల్వల కేంద్రం నుంచి మారుమాల ప్రాంతంలో ఉండే గ్రామాలకు గంటల వ్యవధిలోనే వ్యాక్సిన్లను తరలించేలా మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లను చేరవేయనున్నారు. స్టాక్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్‌కి కేవలం గంటల వ్యవధిలో చేరాలా చూస్తారు. దీని వల్ల తక్కువ సమయంలోనే డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు గమ్య స్థానాలకు చేరుకుంటాయి. ఉష్ణోగ్రత సంబంధిత కారణాల వల్ల వ్యాక్సిన్లు పాడవకుండా ఉంటాయి.

Drone Vaccine Drive starts from Tomorrow in TS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News