Friday, May 10, 2024

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రజల ప్రయోజనాల కోసమే సిఎం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారన్నారు. ఇది బహిరంగ విషయమే అని ఆయన పేర్కొన్నారు.
అధికారిక కార్యక్రమాల పట్ల రాజకీయ దురుద్ధేశాలను ఆపాదించడం రేవంత్ రెడ్డికి సంస్కారం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధిగా విజ్ఞతను ప్రదర్శించాలని ఈ సందర్భంగా వినోద్‌కుమార్ సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం ప్రథమ కర్తవ్యం అని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తమ రాష్ట్ర సమస్యలను కేంద్రానికి తెలుపుతూ, వాటి పరిష్కారానికై పాటుపడటం సాధారణ విషయమేనని అన్నారు.
గతంలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉండగా విపక్ష ముఖ్యమంత్రులు కలువలేదా? అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం మంచి సంప్రదాయం కాదన్నారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించాలని ఆయన సూచించారు.సిఎం కెసిఆర్ గత వారంలో రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఉండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలను కలిసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పనులపై చర్చించారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.
ప్రధానికి, కేంద్ర మంత్రులకు అందించిన వినతి పత్రాల్లోని అంశాలు
1. ఐపిఎస్ క్యాడర్ పై కేంద్రం సమీక్షించాలి.
2. రాష్ట్రంలో సమీకృత టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి.
3. హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయాలి.
4. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
5. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులివ్వాలి.
6.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి.
7. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచాలి.
8.కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు చేయాలి.
9. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాలి.
10. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి.అనే అంశాలకు సంబంధించిన లేఖలున్నాయి.
11. హైదరాబాద్ – విజయవాడ హైవేను 6 లేన్లుగా మార్చాలి.
12. పెండింగ్ లో ఉన్న సీఆర్‌ఐఎఫ్ ప్రతిపాదనలను మంజూరు చేయాలి.
13. ప్రధానమైన నాలుగు రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా స్థాయిని పెంచాలి.
14. హైదరాబాద్ దక్షిణ ప్రాంత ఆర్‌ఆర్‌ఆర్ ను మంజూరు చేయాలి.
15. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతి ఉన్నదని, నీటి కేటాయింపులు జరిగాయని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారని. ఇందుకు సంబంధించిన లేఖలు కూడా ఉన్నాయన్నారు. వీటిని ఒకసారి రేవంత్ చదువుకుంటే మంచిదని వినోద్‌కుమార్ సూచించారు.

MP Vinod Kumar fires on MP Revanth Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News