Sunday, April 28, 2024

పాపువా న్యూ గినియా, పాకిస్తాన్ లో భారీ భూకంపం..

- Advertisement -
- Advertisement -

పసిఫిక్‌ మహాసముద్రంలోని ద్వీపదేశమైన పాపువా న్యూ గినియా ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభంవించింది. మంగళవారం తెల్లవారుజామున 3.16 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభించాయని.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.5గా నమోదైనట్లు యూఎస్‌ జీయోలాజికల్‌ సర్వే వెల్లడించింది. పసిఫిక్ ద్వీపం రాష్ట్రం తూర్పు సెపిక్ ప్రావిన్స్ రాజధాని వెకాక్ పట్టణానికి కొద్ది దూరంలో సముద్ర తీరానికి 20 కిలోమీటర్ల (12 మైళ్ళు) దూరంలో భూకంపం సంభవించిందని తెలిపింది. భూకంప కేంద్రం 12కిలోమీటర్ల(7మైళ్లు) లోతులో ఏర్పడినట్లు గుర్తించారు. భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.

పావువా న్యూ గినియాతోపాటు పాకిస్థాన్‌, టిబెట్‌లోని జిజాంగ్ లోనూ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలో భూమి కంపించింది. మంగళవారం తెల్లవారుజామున 3.38 గంటల సమయంలో 4.2 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్‌ సెఇంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. ఇక, జిజాంగ్ లో ఈరోజు తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News