పేర్లు నమోదుతో పరిమితం అయి ఉన్న మరో 474 గుర్తింపు పొందని రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం తమ జాబితాలో నుంచి తొలిగించివేసింది. పార్టీలుగా నమోదు అయినప్పటికీ నిబంధనలు పాటించకపోవడం, ప్రత్యేకించి గత ఆరు సంవత్సరాలలో ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వంటి అనర్హత కారణాలతో వీటిని డిలిస్టు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం తమ ప్రకటనలో తెలిపారు. గుర్తింపు పొందని రాజకీయ పార్టీలను సంక్షిప్తంగా రూప్స్‌గా వ్యవహరిస్తారు. ఆగస్టు 9వ తేదీన ఎన్నికల సంఘం తమ ప్రక్రియలో భాగంగా తొలి దఫాలో 334 పార్టీలను డిలిస్టు చేసింది. మొత్తం మీద ఇప్పుడు 808 వరకూ ఇటువంటి పార్టీలపై వేటేశారు. ఈ విధంగా ఎన్నికల ప్రక్రియలకు మార్గం మరింత సౌలభ్యం అవుతుందన్నారు. పలువురు ఎన్నికల్లో చందాలకు, మనీ లాండరింగ్‌లకు సొంత పార్టీలను నామమాత్రంగా పెట్టుకోవడం ఆనవాయితీ అయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలనేపథ్యంలో ఇప్పుడు డిలిస్ట్ అయిన పార్టీలు ఏవీ కూడా బరిలోకి దిగడానికి వీలుండదు.
మరో 474 పార్టీలు డిలిస్టు
- Advertisement -
- Advertisement -
- Advertisement -