Tuesday, May 14, 2024

బ్రైట్‌కామ్ గ్రూప్‌లో ముగిసిన సోదాలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః బ్రైట్ కామ్ గ్రూప్‌లో సోదాలు ముగిశాయని ఈడి ప్రకటించింది. డబ్బులను వివిధ కంపెనీలకు తరలించారని సెబీ రిపోర్టు ఇవ్వడంతో ఈడి దాడులు నిర్వహించింది. నానాక్‌రాంగూడలోని కార్యాలయం, ఆడిటర్ మురళిమోహన్‌రావు, కంపెనీ సిఈఓ సురేష్‌రెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కంపెనీ ప్రతినిధులు రూ.868 కోట్లను వివిధ కంపెనీలకు తరలించారని సెబీ పేర్కొంది. దాడులు చేసిన ఈడి అధికారులు మురళిమోహన్ ఇంటి నుంచి రూ.3.30కోట్ల నగదుతోపాటు రూ.9.30 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు ఈడీ స్వాధీనం చేసుకుంది. నకిలీ పత్రాలు సృష్టించి సెబీ నుంచి సంస్థ లబ్ధిపొందింది. అందులో 300కోట్ల రూపాయల నిధులను అనుబంధ కంపెనీలకు బ్రైట్‌కామ్ మళ్లించింది. దీంతో ఈడి బ్రైట్‌కామ్ కంపెనీలపై ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News