- Advertisement -
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘పరదా’ (Paradha). ఈ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘యత్ర నార్యస్తు పూజ్యంతే’ అనే పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటు విడుదల చేశారు. ‘ఎగరేయి నీ రెక్కలే’ అంటూ సాగే బ్యూటీఫుల్ మెలోడీ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు గోపీ సుందర్ సంగీతం అందించగా.. రితేశ్ జీ రావు ఆలపించారు. వనమాలి ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ చిత్రంలో సీనియర్ నటి సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 22వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
- Advertisement -