Tuesday, May 7, 2024

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల పర్వతారోహణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: విభిన్న రంగాలలో విజయాలు సాధిస్తూ ప్రసిద్ది చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఇప్పుడు పర్వతారోహకులుగా తయారయ్యారు. విద్యావేత్తలుగా, సాంస్కృతిక, క్రీడలు వంటి విభిన్న రంగాలలో విజయాలు సాధించి పెట్టేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న తెలంగాణ ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ తమ విద్యార్థులను పర్వతారోహకులుగా తీర్చిదిద్దుతోంది. ఈ సంస్థకు చెందిన విద్యార్థులు ఎస్. ద్వారక్ రెడ్డి, ఎం. పల్లవి, విజయ్ బానోతులు నెపాల్‌లోని మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాప్ ట్రాకింగ్ ను పూర్తి చేశారు. మే 3 నుండి మే 13 వరకు లక్లా నుండి బయలు దేరిన వీరు కాలా పత్తర్ చేరుకున్నారు.

ఇది భూమి నుండి 5545 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ పర్వతారోహణ అనుభవం విద్యార్థులకు అబ్బురపరుస్తోంది. ప్రపంచ రికార్డును కలిగి ఉన్న అతి పిన్న వయస్కుడైన భారతీయ పర్వతారోహకుడు మాలావత్ పూర్ణ మార్గదర్శకత్వంలో వీరు శిక్షణ పొందినందుకు సంతోషంగా ఉన్నారు. విద్యార్థుల చొరవ ఇతర చిన్న పిల్లలకు సూర్తినిస్తోందని ఈఎంఆర్‌ఎస్ సొసైటీ కార్యదర్శి డి. రోనాల్డ్ రోస్ అన్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సెక్రటరి స్వర్ణలత, వి. చంద్రశేఖర్, ఈఎంఆర్‌ఎస్ క్రీడా విభాగం విద్రార్థులను అభినందించారు. వారికి సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News