Monday, May 13, 2024

ప్రపంచ ఆకలి తీర్చడానికి 6 బిలియన్ డాలర్లు సరిపోతాయా?

- Advertisement -
- Advertisement -

Elon Musk and David Besli

న్యూయార్క్:  ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు, ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్లూఎఫ్‌సి)కి చెందిన డేవిడ్ బెస్లీకి మధ్య ఇటీవల వాదపోవాదాలు రంజుకున్నాయి. “ప్రపంచం ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను ప్రపంచ సంపన్నులు జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ వంటివారు తమ సంపదలో కొంత మొత్తాన్ని ఇవడం ద్వారా రూపుమాపవచ్చని” బెస్లీ వ్యాఖ్యానించారు. దానికి “ప్రపంచం ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను 6 బిలియన్ డాలర్లతో ఎలా తీర్చవచ్చో టిటర్ వేదికగా డబ్యూఎఫ్‌పి వివరించగలిగితే, నేనిప్పుడే టెస్లా కంపెనీ స్టాక్‌ను అమ్మేసి ఆ డబ్బు ఇచ్చేస్తాను’ అని ట్వీట్ చేశాడు ఎలాన్ మస్క్.
అఫ్ఘాన్ వంటి దేశాలు తీవ్రమైన ఆకలి, నిరుద్యోగం, ఆర్థిక మందగమనం కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గ్వాటెమాల, హోండూరస్, నికరాగ్వా తదితర దేశాలు తుఫాను, ఆకస్మిక వరదలతో అతలాకుతలమయ్యాయి’ అని బెస్లీ ఇటీవల మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఆదుకోని పక్షంలో దాదాపు 4.20 కోట్ల మంది చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వారిని కాపాడుకోవాలంటే 6 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని, ఎలాన్ మస్క్ సంపదలో ఇది స్వల్ప మొత్తమేనని పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ సంపద విలువ 300 బిలియన్ డాలర్లు. దానిలో రెండు శాతమే బెస్లీ పేర్కొన్నది. కాగా మస్క్ వ్యాఖ్యలకు బెస్లీ జవాబిచ్చారు. ‘ఈ 6 బిలియన్ డాలర్లు ఆహార సంక్షోభాన్ని తీర్చడానికి సరిపోతాయని తానెప్పుడూ చెప్పలేదని, క్లిష్ట పరిస్థితుల్లో 4.20 కోట్ల మంది ఆకలి తీర్చేందుకు ఈ మొత్తం ఉపయోగపడుతుందని మాత్రమే చెప్పానని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News