Monday, May 6, 2024

కరోనా రెండో డోసు వ్యాక్సిన్ పంపిణీ..

- Advertisement -
- Advertisement -

స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో టీకా
ఇంటింటా ప్రచారం చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు
వ్యాక్సిన్ పట్ల నిర్లక్షం చేస్తే ఆరోగ్య సమస్యలు
సమీప కేంద్రాల్లో టీకా తీసుకోవాలని సూచనలు

76.11 crore corona vaccine doses Supply to states

మన తెలంగాణ,సిటీబ్యూరో:  నగరంలో కరోనా వైరస్ విస్తరించకుండా వైద్యశాఖ అధికారులు కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోసు పంపిణీ చేస్తున్నారు. గత నెల రోజుల నుంచి టీకా ఆరోగ్య కేంద్రాల్లో లేకపోవడంతో స్దానిక జనం పలుమార్లు తిరిగి వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి డోసు తీసుకునే వరకు వెంబడి సెకండ్ పట్ల ఎందుకు నిర్లక్షం చేస్తున్నారని నిలదీశారు. దీంతో వైద్యాధికారులు సెకండ్ పంపిణీ చేయకుంటే ఒకవేళ థర్డ్‌వేవ్ వస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించి నగర ప్రజలకు సరిపడ టీకాను ఆరోగ్య కేంద్రాల్లో నిల్వలు ఉంచారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి ఆశావర్కర్, అంగన్వాటీ వర్కర్ వీఆర్‌ఏ సభ్యులుగా చేసి, ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారి నియమించి ప్రతి రోజు వ్యాక్సిన్ వేగం జరిగేలా చేపడుతున్నట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు.

వారం రోజుల కితం సరిపడ వ్యాక్సిన్ డోసులు, సిరంజిలు సరఫరా చేసినట్లు తెలిపారు. గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో ఇప్పటివరకు 1,14,93,410 మంది వ్యాక్సిన్ తీసుకోగా హైదరాబాద్ జిల్లా పరిధిలో 47,94,882మందికి టీకా వేయగా, అందులో మొదటి డోసు 30,89,620 మంది, సెకండ్ డోసు 17,05,226మంది తీసుకున్నారు. రంగారెడ్డిలో 34,17, 390 మంది తీసుకోగా, మొదటి డోసు 22, 49, 720 మంది, సెకండ్ డోసు 11,69,456మంది, మేడ్చల్ జిల్లాలో 32,86,996మందికి వ్యాక్సిన్ పంపిణీ చేయగా, మొదటి డోసు 20,85,893మంది, సెకండ్ డోసు 11.98,103మంది తీసుకున్నట్లు ఆయా జిల్లా వైద్యాధికారులు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

వీరందరికి పది రోజుల్లో పూర్తి చేస్తామని, ఇప్పటివరకు టీకా తీసుకోని వారిని కూడా గుర్తించామని, వారికి కూడా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామంటున్నారు. నవంబర్ రెండో వారంలోగా గ్రేటర్ పరిధిలో వందశాతం టీకా పంపిణీ పూర్తి చేసి థర్డ్‌వేవ్ వచ్చి తట్టుకునేలా చేస్తామంటున్నారు. నగర ప్రజలు వైరస్ పట్ల నిర్లక్షం చేయకుండా ముఖానికి మాస్కులు ధరించాలని, జేబుల్లో శానిటైజర్ ఉంచుకోవాలని, దీపావళి పండగ సందర్భంగా మాల్స్, దుకాణాల్లో జనం రద్దీ ఉందని, యాజమాన్యాలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. పండగలు, వేడుకల పరిమిత సంఖ్యలో చేసుకోవాలని, గుంపులు చేరి అట్టహాసంగా నిర్వహిస్తే వైరస్ ఉనికి చాటుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలికాలం ముగిసేవరకు కోవిడ్ నిబంధనలు పాటించాలని పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News