Thursday, May 2, 2024

బిజెపి మాజీ ఎంఎల్ఎ… దమ్ముంటే నిరూపించు: ఎర్రోళ్ల శ్రీనివాస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మాటలు పూర్తి అవాస్తవమని అబద్దాలు ఆడడంలో ఆయనను మించిన వారు లేరు అని టిఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాటలు పూర్తి అవాస్తవమని తాము ఖండిస్తున్నామన్నారు. వైద్య శాఖలో జరిగిన టెండర్లలో వైద్యారోగ్యా శాఖ మంత్రి హరీష్ రావుకు ఎలాంటి సంబంధం లేదని,  అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ బిజెపి నాయకులని మండిపడ్డారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ బిజెపి లీడర్లు అబద్దాలు మాత్రమే ప్రచారం చేస్తారని విరుచుకపడ్డారు. జోక్ ఆఫ్ ది ఇయర్ గా మాజీ ఎమ్మెల్యే మాటలు నిలుస్తాయని,  కొంత మందికి తొత్తులుగా మాట్లాడుతున్నారని బిజెపి నాయకులపై మండిపడ్డారు.

రెండు ఏజన్సీల పంచాయితీ ని రాష్ట్ర ఆరోగ్య శాఖకు అంతకట్టడం అవగాహన రాహిత్యమని ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.  కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకలకు అనుగుణంగా జెమ్ టెండర్ లు వేయడం జరిగిందని, రెండు ఏజెన్సీల పంచాయితీ ని ఆరోగ్య శాఖకు అంటకడితే సహించమని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం మీద నిందలు వేస్తే ఊరుకునేది లేదని, ఒక్కరికి తొత్తుగా వ్యవహరించడం ఈ బిజెపికి దిక్కుమాలిన చర్య అని,  ఈ టెండర్ల ఇష్యు కోర్టులో ఉందని, కోర్టు ఆదేశాల మేరకు పని చేస్తామన్నారు. ప్రభుత్వం మీద బురద చల్లితే ఊరుకునే ప్రసక్తే లేదని ప్రభాకర్ కు హెచ్చరించారు. అక్రమార్కులకు, అవినీతి పరులకు కేరాఫ్ అడ్రస్ మీ బిజెపి పార్టీ, నేతలు దుయ్యబట్టారు.  దమ్ముంటే రుజువు చెయాలని, లేదంటే ముక్కు నేలకు రాయాలని సవాలు విసిరారు.  ఆరోపణలు చేసేముందు అవగాహన ఉండాలి ఆయనకు ఎలాంటి అవగాహన లేకుండానే ఎలా ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడితే ఎలా అని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News