ఆకుల అఖిల్, దర్శిక మీనన్, చిత్రం శ్రీను, గడ్డం నవీన్, చిట్టిబాబు, రేవతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం బాలుగాడి లవ్ స్టోరీ. (Balugadi love story) ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల మంజుల నిర్మిస్తున్న ఈ చిత్రంతో యల్. శ్రీనివాస్ తేజ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 8న విడుదల కాబోతోంది. ఈ సినిమాను ’సిల్వర్ స్క్రీన్’ గణేష్ భారీగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా (pre-release event was grand) జరిగింది.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు జర్నలిస్ట్ ప్రభు, కిషోర్ దాస్, వినోద్ చౌదరి, మహేంద్రనాధ్, మేఘన, మానిక్, తల్లాడ సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఆకుల భాస్కర్ మాట్లాడుతూ నిజ జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఎల్.శ్రీనివాస్ తేజ్ ఈ సినిమాను తెరకెక్కించడం జరిగిందని తెలిపారు. దర్శకుడు ఎల్. శ్రీనివాస్ తేజ్ మాట్లాడుతూ ఈ సినిమాలో కామెడీ, లవ్, యాక్షన్… ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని అన్నారు.