Thursday, May 2, 2024

ప్రతి గర్భిణి పౌష్టికాహారం తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

గద్వాల ప్రతినిధి : పోషణ మాసం సందర్భంగా ప్రతి గర్భిణీ పౌష్టికాహారం తీసుకోవాలని, బ రువు తక్కువ ఉన్న పిల్లలను ప్రత్యేక శ్రద్ద తో పోషకాహారం అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా నూతన సమీకృత కార్యాలయ సమావేశం హాల్‌లో పోషణ మాసంపై అధికారులతో ప్రతిజ్ఞా నిర్వహించారు.

ఇ ంటింటా పోషణ సంబరాలు, పోషణకు ఐదు సూత్రాలు, పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ పోషణ మాసం సందర్బంగా నేను ప్రతి ఇంటికి సరైన పోషణ, పోషకాహారం, తాగునీరు , పరిశుభ్రతలపై సమాచారం ఇస్తామని, ప్రతి ఇళ్లు, బడి, పల్లె, పట్టణం సరైన పోష ణ నినాదాలతో మారు మోగేలా చేస్తానని, జన చైతన్యం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని ప్రతిజ్ఞా చేయించారు.

ప్రతి తల్లికి బిడ్డకు సరైన పోషణ ఆరోగ్యం ఉండాలన్నారు. అనంతరం పోషణ మాంసనకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. అది కారులందరి చేత పోషణ మాసంనకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌లు అపూర్వే చౌహన్, చీర్ల శ్రీనివాస్ , శిశు సంక్షేమ అధికారిని ముసాయిదాబేగం, ఆర్డీఓ చంద్రకళ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News