Tuesday, April 30, 2024

గుప్త్త నిధుల కోసం తవ్వకాలు.. ఏడుగురిపై కేసు

- Advertisement -
- Advertisement -

రెండు విగ్రహాలు స్వాధీనం.. ఏడుగురిపై కేసు

మన తెలంగాణ/చిట్యాల: గుప్త్త నిధుల కోసం జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ రెం డు విగ్రహాలను స్వాధీనం చేసుకొని ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకా రం.. మండలంలోని వరికోల్‌పల్లి శివారులో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు పంచాయతీ కార్యదర్శి శ్రవణ్‌కుమార్ తమకు ఫిర్యా దు చేశారని అన్నారు.

దీనిపై దర్యాప్తు చేయగా విగ్రహాలు దొరికిన విష యం వాస్తవమేనని తెలిసిందని అన్నారు. ఈ మేరకు కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించగా వేంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి విగ్రహాలు దొరికినట్లు తేలింద అన్నారు. తవ్వకాలు జరిపిన వరికోల్‌పల్లి, అందుకుతండాలకు చెందిన వంగల రమేశ్, గోవిందుల రాజయ్య, వల్లపు జనార్దన్, చెక్క రమేశ్, గోవిందుల సదయ్య, గుండబోయిన సదయ్య, దామెరశెట్టి వీరయ్యలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News