Thursday, April 25, 2024

ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతి

- Advertisement -
- Advertisement -

Export of BrahMos missiles to the Philippines

రూ.2,850 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకాలు

న్యూఢిల్లీ: రక్షణ రంగంలో ఆయుధాలను ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకునే ఆనవాయితీకి స్వస్తి పలుకుతూ మన దేశం ఇప్పుడు అత్యంత నాణ్యతతో స్వదేశంలోనే ఆయుధాలను తయారు చేసుకుంటోంది. అంతేకాదు,, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయాలని భావిస్తోంది. ఇప్పడు ఆ దిశగా అడుగులు పడ్డాయి. భారత్, ఫిలిప్పీన్స్ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఆ దేశ నౌకాదళానికి భారత్ తాము రూపొందించిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులను విక్రయించనుంది. ఈ ఒప్పందం విలువ 374 బిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో రూ.2,800 కోట్లకుపైమాటే. ఈ క్షిపణులను మన దేశం తొలిసారిగా ఒక దేశానికి ఎగుమతి చేస్తుండడం గమనార్హం. ‘ఫిలిప్పీన్స్‌కు యాంటీ షిప్ మిసైల్స్‌ను సరఫరా చేసేందుకు బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్( బిఎపిఎల్) జనవరి 28న( శుక్రవారం) రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్ జాతీయ రక్షణ విభాగంతో ఒప్పందం కుదుర్చుకుంది’ అని రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

బ్రహ్మోస్ ఏరోస్పేస్ సిఇఓ అతుల్ డి రాణె, డిస్యూటీ సిఇఓసంజీవ్ జోషీ, లెఫ్టెనెంట్ కల్నల్ ఆర్ నేగి, ప్రవీణ్ పాఠక్‌ల సమక్షంలో ఒప్పందంపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో పాలు పంచుకున్నందుకు తాను గర్విస్తున్నానని ఫిలిప్పీన్స్‌లో భారత రాయబారి శంభు కుమరన్ అన్నారు. నౌకలు, జలాంతర్గాములు, నేలమీదినుంచి 400 కిలోమీటర్ల లోపు ఉండే ఏ లక్షాన్నైనా ఛేదించే విధంగా బ్రహ్మోస్ క్షిపణి రకాలను శాస్త్రవేత్తలు తయారు చేశారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ( డిఆర్‌డిఓ), రష్యాకు చెందిన సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ఈ క్షిపణులను తయారు చేసింది. భారత రక్షణ దళం అమ్ముల పొదిలో చేరిన బ్రహ్మోస్ క్షిపణులను పెద్ద సంఖ్యలో చైనా, పాక్ సరిహద్దుల్లో ఇప్పటికే మోహరించడం జరిగింది. ఆయా క్షిపణులను మరింత మెరుగుపరిచేలా సన్నద్ధతలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News