Friday, April 26, 2024

మేము ఎలాంటి ప్రమాణాలను నిర్దేశించలేము

- Advertisement -
- Advertisement -

Key judgment of Supreme Court on reservations in SC and ST promotions

రాష్ట్రప్రభుత్వాలే లెక్కలు సేకరించాలి
ఎస్‌సి, ఎస్‌టి ప్రమోషన్లలో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ: ప్రమోషన్లలో ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్ల కేసుపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలు( ఎస్‌సి), షెడ్యూల్డ్ తెగల(ఎస్‌టి) ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పనపై తాము ఎలాంటి ప్రమాణాలను నిర్దేశించలేమని జస్టిస్ ఎల్. నాగేశ్వర రావునేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.ప్రాతినిధ్య ప్రమాణాలను నిర్ణయించడానికి న్యాయస్థానం వద్ద ఎలాంటి కొలమానం లేదని తెలిపింది. ఎస్‌సి, ఎస్‌టిల ప్రాతినిధ్యంపై రాష్ట్రప్రభుత్వాలే లెక్కలు సేకరించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రమోషన్ల డేటా సమీక్షకు వ్యవధి సహేతుకంగా ఉండాలనితెలిపింది. రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వాలు తపనిసరిగా సమీక్ష నిర్వహించాలని పేర్కొంది.

దామాషా ప్రాతినిధ్యం,తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం వంటి అంశాలను రాష్ట్రప్రభుత్వాలే చూసుకోవాలని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్ కూడా ఉన్న ధర్మాసనం పేర్కొంది. కాగా, ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పనలో ప్రమాణాలను నిర్దేశించడంలో ఎదురవుతున్న అయోమయాన్ని రం చేయాలని కోరుతూ, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏళ్ల తరబడి ఎస్‌సి, ఎస్‌టిలను జ్రాతీయ జన జీవన స్రవంతికి దూరంగా ఉంచడం జరిగిందని, వారికి సమాన అవకాశం ఇవ్వడానికి రిజర్షేన్ల రూపంలో సమానత్వం కల్పించడం దేశ ప్రయోజనాల దృష్టా అవసరమని విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కెకె వేణు గోపాల్ చెప్పారు. దీనిపై వాదనలను విన్న కోర్టు గత ఏడాది అక్టోబర్ 26న తీర్పును వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News