Thursday, May 2, 2024

ఆదాయం పన్ను రిటర్న్‌ల గడువు పెంపు

- Advertisement -
- Advertisement -

Extension of income tax return

న్యూఢిల్లీ: 2019-20 ఆర్థిక సంవత్సరానికి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల రిటర్న్‌లు దాఖలు చేసే గడువును నెల రోజులు పొడిగించినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పడు ఈ గడువు 2020 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. అలాగే ఆడిట్ రిపోర్టులు దాఖలు చేయడానికి గడువును కూడా డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ( సిబిడిటి) తెలియజేసింది. కాగా రూ. లక్ష వరకు సెల్ఫ్ అసెస్‌మెంట్ టాక్స్ బకాయి ఉన్న వారు సెల్ఫ్ అసెస్‌మెంట్ టాక్స్ చెల్లింపునకు గడువును 2021 జనవరి 31 వరకు పొడిగించినట్లు కూడా సిటిబిటి తెలియజేసింది. ఇక ఆడిట్ అనంతరం పన్ను చెల్లించే వారు మరో నెల తర్వాత అంటే 2021 జనవరి 31 లోగా సమర్పించవచ్చని ఆ శాఖ తెలియజేసింది. కొవిడ్19 వ్యాప్తి దృష్టా పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం ఇచ్చే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ వివరించింది.

Extension of income tax return

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News