Saturday, April 27, 2024

ఫేస్‌బుక్‌తో గాలం

- Advertisement -
- Advertisement -

Facebook fraud in Hyderabad

గిఫ్టుల పేరుతో రూ.38,57,000 దోచుకున్న
నైజీరియాకు చెందిన నిందితుడు
అరెస్టు చేసిన నగర సిసిఎస్ పోలీసులు

హైదరాబాద్: ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుని, గిఫ్టులు పంపిస్తున్నానని చెప్పి భారీ ఎత్తున డబ్బులు దోచుకున్న నైజీరియాకు చెందిన నిందితుడిని నగర సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి ఏడు మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంక్ పాస్‌బుక్‌లు, డెబిట్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నైజీరియాకు చెందిన ఒనేకియా సోలోమాన్ విజ్‌డం అలియాస్ సిమోన్ న్యూఢిల్లీలోని జనకపూరి, చాణక్యప్లేస్‌లో ఉంటున్నాడు. నిందితుడు ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి హైప్రొఫైల్ క్రియేట్ చేసేవాడు. దాని నుంచి పలువురికి ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్‌లు పంపిస్తున్నాడు. దానికి స్పందించిన వారితో కొంత కాలం చాలా నమ్మకంగా ఫ్రెండ్‌షిప్ చేసేవాడు. వారి వాట్సాప్ నంబర్ తీసుకుని ఛాటింగ్ చేసేవారు. నమ్మకం కుదిరిన తర్వాత యూకే పౌండ్లు, బంగారం, విలువైన వస్తువులు పార్సిల్ పంపిస్తున్నానని చెబుతాడు.

తర్వాత వారికి పార్సిల్ గురించి చెప్పేవాడు. నగరంలోని మారేడుపల్లికి చెందిన బాధితురాలికి నిందితుడు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. కొంత కాలం తర్వాత యూకే పౌండ్లు, బంగారం , విలువైన వస్తువులు పంపిస్తున్నానని ఏప్రిల్,24,2020న ఫోన్ చేసి చెప్పాడు. తర్వాత ఢిల్లీ కస్టమ్స్ అధికారిని ఫోన్ చేస్తున్నానని ఓ వ్యక్తి ఫోన్ చేసి మీకు పార్సిల్ వచ్చిందని చెప్పాడు. దానికి ఛార్జి రూ.5,000 చెల్లించాలని చెడంతో తన బ్యాంక్ ఖాతా నుంచి పంపించింది. తర్వాత మళ్లీ కస్టమ్స్, జిఎస్‌టి, ఇన్సూరెన్స్ తదితర ఛార్జీల కింద దశల వారీగా రూ.38,57,000 పంపించింది. అయినా కూడా మళ్లీ డబ్బులు అడుగుతుండడంతో తాను మోసపోయానని గ్రహించి నగర సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ గంగాధర్ ఎస్సైలు సంతారావు, శ్రీకాంత్, పిసిలు సునీల్, నరేష్, సుదర్శన్, నరిసంగ్ తదితరులు నిందితుడిని పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News