Tuesday, April 30, 2024

మంత్రి సత్యేందర్ జైన్ పై నకిలీ కేసు : కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Fake case against Minister Satyendar Jain: Arvind Kejriwal

 

న్యూఢిల్లీ : రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కేంద్రంపై విరుచుకు పడ్డారు. తమ మంత్రిపై మోపిన కేసు పూర్తి నకిలీదని, అది రాజకీయ ప్రేరేపిత కేసు అని విమర్శించారు. తమ పార్టీ , ప్రభుత్వాలు నిజాయతీకి కట్టుబడి ఉన్నాయని , అవినీతిని సహించవని స్పష్టం చేశారు. ఈ కేసులో జైన్‌పై వచ్చిన ఆరోపణల్లో ఒక్క శాతమైనా నిజమని తేలి ఉంటే తానే స్వయంగా ఆయనపై చర్యలు తీసుకునేవాడినని తెలిపారు. ఇది పూర్తిగా నకిలీ, రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు. మాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. జైన్ సత్య మార్గంలో నడుస్తున్నారు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని కేజ్రీవాల్ అన్నారు. తమ మంత్రి జైన్‌ను ఈడీ త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని జనవరి లోనే పంజాబ్ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఢిల్లీలో మంగళవారం రోడ్డు అభివృద్ధి పనుల తనిఖీ సందర్భంగా కేజ్రీవాల్ విలేఖరులతో మాట్లాడారు.

అవినీతి ఆరోపణలపై ఇటీవల పంజాబ్ ఆరోగ్యమంత్రి విజయ్ సింగ్లాను సీఎం భగవంత్ మాన్ తన మంత్రి వర్గం నుంచి తొలగించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ కేసులో సాక్షాధారాలను తొక్కిపెట్టే అవకాశం ఉన్నప్పటికీ ఆప్ ప్రభుత్వం చొరవ తీసుకుని , మంత్రిని అరెస్టు చేసిందని చెప్పారు. అయిదేళ్ల క్రితం సైతం ఢిల్లీలో మంత్రిని తొలగించి , సిబిఐకి స్వయంగా లేఖ రాసిన విషయాన్ని ఉటంకించారు. తాము దర్యాప్తు సంస్థల కోసం వేచి చూడమని, స్వయంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పైగా కేంద్ర దర్యాప్తు సంస్థల అనేక కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News