Tuesday, May 14, 2024

నకిలీ జడ్జి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః భూ వివాదాలు పరిష్కరిస్తానని చెప్పి పలువురు అమాయకుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ జడ్జిని మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి, ఉప్పల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నకిలీ జడ్డి, గన్‌మెన్‌ను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పిస్తోల్, 5 రౌండ్లు, మ్యాగిజిన్, కారు, నకిలీ విజిటింగ్ కార్డులు, రూ.7,500 నగదు,మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….కరీంనగర్ జిల్లా, వేములవాడకు చెందిన నామాల నరేందర్ నగరంలోని రామంతపూర్‌లో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. ఎపిలోని అనంతపురం జిల్లాకు చెందిన చిక్కం బధుసుదన్ రెడ్డి ఎక్స్‌సర్వీస్‌మెన్, జీడిమెట్లలో ఉంటున్నాడు. నామాల నరేందర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక్కడ కొందరితో తిరగడంతో వ్యసనాలకు బానిసగా మారాడు.

సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి దొంగతనాలు చేశాడు. 2014 నుంచి 2016 వరకు హైదరాబాద్, కరీంనగర్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలు చేశాడు. దీంతో 2017లో ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేసి పిడి యాక్ట్‌పై జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఖమ్మం జిల్లాకు వెళ్లి తాను అసిస్టెంట్ జడ్జినని చెప్పి అమాయకులను నమ్మించి వారి భూమి వివాదలను పరిష్కరిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశాడు. మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఖమ్మం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అమీర్‌పేటలో సంతోష్ అనే వెబ్ డిజైనర్ వద్ద జడ్జికి సంబంధించిన నకిలీ ఐడి కార్డు తయారు చేయించుకున్నాడు. అందరు నమ్మే విధంగా ఆర్మిలో పనిచేసి రిటైర్డ్ అయిన మధుసూదన్‌రెడ్డిని గన్‌మెన్‌గా నియమించుకున్నాడు.

ఈ క్రమంలోనే నిందితుడికి 2021లో వనస్థలిపురానికి చెందిన గార్లపాటి సోమిరెడ్డి పరిచయం అయ్యాడు. అతడి భూ వివాదం కోర్టులో ఉండడంతో దానిని పరిష్కరిస్తానని, తాను అసిస్టెంట్ జడ్జినని చెప్పడంతో బాధితుడు నమ్మి రూ.10లక్షలు ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న తర్వాత నిందితుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇద్దరు కలిసి హైదరాబాద్ పరిసరాల్లో ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్లు వాసు, గోవిందరెడ్డి, రాములు, ఎస్సైలు వాసుదేవ్, పరమేశ్వర్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News