Thursday, May 2, 2024

అంతరాష్ట్ర నకిలీ పోలీస్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Fake policeman arrested by Central Zone Task Force police

 

హైదరాబాద్ : పోలీస్‌నని చెబుతూ అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీస్‌ను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి బైక్, యాపిల్ వాచ్, బంగారు రింగ్, యాపిల్ పోన్లు రెండు, టార్చ్‌టైట్, పోలీస్ ఐడి కార్డు, ఐపాడ్ కేసును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….జనగాం జిల్లా, స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన మరాఠీ సృజన్‌కుమార్ అలియాస్ సూర్య అలియాస్ చరణ్ అలియాస్ చెర్రీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. పదోతరగతి వరకు చదువుకున్న నిందితుడు వ్యసనాలకు బానిసగా మారండంతో విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. 2007 నుంచి చోరీలు చేయడం ప్రారంభించాడు. సృజన్‌పై తెలంగాణలో 14, ఎపిలో నాలుగు కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 07వ తేదీన సాయంత్రం ఓ జంట నెక్లెస్ రోడ్డులో కారులో కూర్చున్నారు.

నిందితుడు బ్లూకలర్ బైక్‌పై వారివద్దకు వెళ్లాడు. తాను టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ అని ఐడి కార్డును చూపించాడు. ఇక్కడ ఎందుకు కారులో ఉన్నారని, కేసు నమోదు చేస్తామని బెదిరించాడు. కేసు నమోదు చేయవద్దని అంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. బాధితుల వద్ద డబ్బులు లేకపోవడంతో వారిని బంజారాహిల్స్‌లోని రోడ్డునంబర్1లో ఉన్న కమాల్ వాచ్ షాపుకు తీసుకుని వెళ్లి బిఫిట్‌లింక్ బికే వాచ్‌ను కొనుగోలు చేయించి తీసుకున్నాడు. వారిని నెక్లెస్ రోడ్డుకు తీసుకుని వచ్చి వదిలేసి పారిపోయాడు. బాధితులు రాంగోపాల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితుడిపై మహంకాళీ పోలీస్ స్టేషన్‌లో నాన్‌బేయిలబుల్ కేసు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. ఇన్స్‌స్పెక్టర్ రాఘునాథ్, ఎస్సైలు నవీన్‌కుమార్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News