Thursday, May 2, 2024

నకిలీ సేల్ డీడ్‌ల ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

fake sale deed gang arrested in hyderabad

రూ.1.02కోట్ల సొత్తు స్వాధీనం
ఎనిమిది మంది అరెస్టు, పరారీలో ఐదుగురు
పట్టుకున్ను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు

హైదరాబాద్: నకిలీ సేల్ డీడ్‌తో ప్లాట్‌ను ఆక్రమించేందుకు యత్నించిన ముఠాను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, ఆదిబట్ల పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.1.02 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….గోరంట్ల నర్సింహ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, గుండపనేని వేణుగోపాల్ రావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, దొంతి సాయి రాజ్, బాషిపాంగు నాగరాజు, ఏదుల శ్రీనివాస్ రెడ్డి, కొత్తపల్లి కృష్ణ, తేలు వీరేష్, మహ్మద్ నాసీర్ అహ్మద్, దయాకర్, చంపాపేట్ సబ్ రిజిస్ట్రార్, భాస్కర్, రాఘవేందర్ రెడ్డి, నర్సమ్మ నిందితులుగా ఉన్నారు. నాదర్‌గుల్ గ్రామంలో పసుపులేటి లక్ష్మివెంకట్‌కు 1986 నుంచి 600 గంజాల భూమి ఉంది.

నిందితులు ప్లాట్ ఖాళీగా కన్పించడంతో వాటికి సంబంధించిన నకిలీ సేల్ డీడ్‌ను సృష్టించారు. ఖాళీ ప్లాట్‌కు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను సేకరించిన నిందితులు దానికి అనుగుణంగా ప్లాట్ యజమాని లక్ష్మినర్సమ్మ 1994లో మృతిచెందినట్లు గుర్తించారు. ఆమె పేరుతో వారసిగూడకు చెందిన వృద్ధురాలికి డబ్బులు ఇచ్చి ఆమెను నర్సమ్మగా చేశారు. ఆమె పేరుతో నకిలీ ఆధార్ కార్డు, నకిలీ సేల్ డీడ్‌ను సృష్టించి మరో వ్యక్తికి విక్రయించినట్లు సృష్టించారు. ప్లాట్‌ను రాఘవేంద్ర అనే వ్యక్తి రూ.7లక్షలకు కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. అక్కడ ప్లాట్ మార్కెట్ విలువ రూ.85,00,000 ఉంటుంది. మిగతా నిందితులు అందరూ కలిసి ప్లాట్‌ను నకిలీ వ్యక్తిపై రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయం తెలియడంతో అసలు వారసురాలు ఆదిబట్ల పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News