- Advertisement -
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఒజి’ (OG Movie). సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా టికెట్ విక్రయాలు ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. హాట్‌కేకుల్లా ఈ టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని శ్రీనివాస థియేటర్లో ‘ఒజి’ చిత్రం బెనిఫిట్ షో టికెట్‌ని వేలం వేశారు. ఈ వేలంలో పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్కారం గ్రామానికి చెందిన అభిమాని ఆముదాల పరమేశ్.. బెనిఫిట్ షో తొలి టికెట్‌ని ఏకంగా రూ.1,29,999కి దక్కించుకున్నాడు. వేలం పాట ద్వారా వచ్చిన డబ్బును జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్లు అభిమానలు తెలిపారు.
Also Read : మోహన్ లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
- Advertisement -