- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఏడాదికిపైగా పోరాటం చేశారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రైతుల ఉద్యమం పంజాబ్, హరియాణాకు చెందినది కాదన్నారు. యావత్ దేశ ప్రయోజనాల కోసం రైతులు పోరాడారని ఆయన పేర్కొన్నారు. రైతుల ఉద్యమానికి చాలా రాష్ట్రాలు మద్దతు తెలిపాయన్నారు. ఆందోళనలో పాల్గొన్న రైతులకు ఢిల్లీ ప్రభుత్వం అండగా నిలిచిందని కేజ్రీవాల్ తెలిపారు. ఎండ, వాన, చలిలో ఉన్న రైతులకు కొంత సహాయం చేయగలిగామని సిఎం కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీ స్కూల్స్, ఆస్పత్రులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు.
- Advertisement -