Saturday, April 27, 2024

ఢిల్లీ ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన మహిళ, కుమార్తెలు!

- Advertisement -
- Advertisement -

 

Self immolation

న్యూఢిల్లీ: 50 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు తమ దక్షిణ ఢిల్లీలోని తమ ఫ్లాట్‌ను విషవాయువు గదిగా మార్చి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. వసంత్ విహార్ పరిసరాల్లోని ఫ్లాట్ నుండి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లు వారి భయంపుట్టించే ప్రణాళికను వెల్లడించాయి. అన్ని తలుపులు, కిటికీలు, వెంటిలేటర్‌లను రేకు లాంటి పదార్ధంతో ప్యాక్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు, స్పష్టంగా గది నుండి పొగ బయటకు రాకుండా చేశారు. అంతేకాక లోపల ఎవరూ చూడలేరు. ఈ మెటీరియల్ అంతా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినట్లు విచారణలో తేలింది. మంటలు,  వెంటిలేషన్ లేకపోవడం వల్ల గదిలో విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ పేరుకుపోయి ముగ్గురూ  చనిపోయివుండాలి. పోలీసులు ఫ్లాట్‌లోకి ప్రవేశించినప్పుడు, ఒక బెడ్‌రూమ్‌లో మూడు మృతదేహాలు, వాటి పక్కన బొగ్గు మంటలు కాలుతుండడం కనిపించింది.

సూసైడ్ నోట్‌లలో ఒకదానిలో, ఫ్లాట్‌లోకి ప్రవేశించే ఎవరైనా అగ్గిపెట్టె వెలిగించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. “చాలా ప్రాణాంతకమైన వాయువు… లోపల కార్బన్ మోనాక్సైడ్. ఇది మండుతుంది. దయచేసి కిటికీ తెరిచి, ఫ్యాన్ తెరవడం ద్వారా గదిని వెంటిలేట్ చేయండి. అగ్గిపెట్టె, కొవ్వొత్తి లేదా మరేదైనా వెలిగించవద్దు !! గది నిండా ప్రమాదకరమైన గ్యాస్ ఉంటుంది కాబట్టి కర్టెన్‌ను తొలగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆ గ్యాస్ పీల్చుకోవద్దు” అని ఆంగ్లంలో చిల్లింగ్ సూసైడ్ నోట్ రాసి ఉంది.

మహిళను మంజు శ్రీవాస్తవ, ఆమె కుమార్తెలు అన్షిక, అంకుగా గుర్తించారు. మహిళ భర్త ఉమేష్ చంద్ర శ్రీవాస్తవ గత సంవత్సరం కోవిడ్‌తో మరణించాడని, అప్పటి నుండి కుటుంబం కలత చెందిందని,  ఇంటి పనివారు,  పొరుగువారు పోలీసులకు చెప్పారు. మహిళ కూడా అస్వస్థతకు గురైంది.పైగా మంచానికి పరిమితమైందని పోలీసులు తెలుసుకున్నారు.

రెసిడెన్షియల్ సొసైటీ ప్రెసిడెంట్, M డేవిడ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ‘‘కుటుంబం ఇంటిని ‘పొగ చాంబర్”గా మార్చింది అన్నారు. ఇదిలావుండగా తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News