Sunday, December 15, 2024

లాభదాయక సాగుపై అవగాహనకే రైతు పండుగ

- Advertisement -
- Advertisement -

కొత్త పంటలు, యాంత్రీకరణపై
అవగాహన కల్పించడమే
లక్షం రైతు పండుగ
వ్యవసాయ ప్రదర్శన
ప్రారంభించిన అనంతరం
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మనతెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో : వ్యవసాయ రంగంలో నూతన ధోరణులు, లా భదాయక వ్యవసాయంపై రైతులకు అ వగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా, అమిస్తాపూర్ గ్రామం వద్ద ఏర్పాటు చేసిన రైతు పండుగ వ్యవసాయ ప్రదర్శన ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దామోదర రా జనర్సింహ, ఎక్సైజ్, ప్రొహిబిషన్, పర్యాట క శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ..రానున్న నాలుగేళ్ల లో రైతుల కోసం ప్రభుత్వం అనుకున్న ప నులన్నీ చేసి సెహభాస్ అనిపించుకుంటుందన్నారు.

ఈ రైతు పండుగ వ్యవసా య ప్రదర్శనలో ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, ఆహార పదార్ధాల ప్రదర్శనపై 117 స్టాళ్లు ఏర్పాటు చేశామని అన్నారు. సేంద్రియ వ్యవసాయంతో పాటు, సాంకేతికతను జోడించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే విధంగా మెలకువలను అందించడానికి ఈ రైతు పండుగ వ్యవసాయ సదస్సు ఉపయోగపడుతుందని అన్నారు. ఆయిల్ పామ్ తోటలు పెంచితే తమ ప్రభుత్వం భరోసాగా ఉంటుందని అన్నారు. వ్యవసాయ రంగంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి లాంటి మేధావులు లాభసాటి వ్యవసాయం ఏ విధంగా చేయాలో ఈ సదస్సులో అవగాహన కల్పిస్తారని అన్నారు.

ఇతర దేశాల్లో ఎలాంటి పంటలు పండించినా లాభం పొందుతున్నారని, కొత్త పంటలపై రైతులకు 3 రోజుల సదస్సులో అవగాహన కల్పిస్తారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదృష్టం కొద్ద్దీ పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని, ఈ జిల్లాను వలసల జిల్లా కాకుండా వలసలు వచ్చే జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దామోదర రాజ నర్సింహ మాట్లాడుతూ.. 117 స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఇంత గొప్ప రైతు సదస్సును ఇప్పటివరకు తాను చూడలేదన్నారు. 20032004 ప్రాంతంలో వ్యవసాయం దండగ అని ప్రచారం జరిగితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించి కొంతవరకు పూర్తి చేయడం వల్ల వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించారని అన్నారు. ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందన్నారు.

రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.70 వేల కోట్ల కంటే తక్కువ రుణ భారం ఉండేదని, గడిచిన పదేళ్ల కాలంలో ఏకంగా రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి గత ప్రభుత్వం అప్పజెప్పిందని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు గడచిన 10 నెలల్లో సుమారు రూ 60వేల కోట్లు వడ్డీ కిందనే చెల్లిస్తున్నామని అన్నారు. ఇలాంటి క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో సైతం ప్రభుత్వం వచ్చాక రైతు రుణమాఫీ చేసిందని తెలిపారు. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి మాట్లాడుతూ.. 2004 కంటే ముందు పాలమూరు జిల్లాలో పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండేదని, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాలమూరు జిల్లాలో భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిలసాగర్ వంటి నీటి పారుదల ప్రాజెక్టులను ప్రారంభించి కొంతవరకు పూర్తి చేయడం వల్ల జిల్లాలో సాగునీరు వచ్చిందన్నారు. వ్యవసాయ కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండ రెడ్డి మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగకు ఇంకా నెలన్నర రోజుల ముందే మహబూబ్‌నగర్ జిల్లాలో రైతును రాజు చేయడానికి వ్యవసాయ పండుగ జరుపుకోవడం జరుగుతున్నదని అన్నారు. రైతు పండుగ కార్యక్రమ సభాధ్యక్షుడు, దేవరకద్ర ఎంఎల్‌ఎ జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ..

నవంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు రైతులకు సేంద్రియ, ఆధునిక వ్యవసాయంపై ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తల ద్వారా అవగాహన కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ సంవత్సర కాలంలో రూ.52 వేల కోట్ల నిధులను రైతులకు వివిధ పథకాల కింద ఖర్చు చేసిందని అన్నారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచ్చేసి రైతులకు సంతోషకరమైన ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి రైతులు భారీగా తరలిరావాలని కోరారు. మహబూబ్‌నగర్ ఎంఎల్‌ఎ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందన్నారు. మార్కెట్‌లో సన్న రకానికి రూ 3 వేల ధర పలుకుతోందని తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి స్వాగతోపన్యాసం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 3 రోజుల పాటు నిర్వహించనున్న రైతు పండుగలో రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందర్ రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, సెరీకల్చర్ డైరెక్టర్ యాస్మిన్ భాష, ఎంఎల్‌సి కూచుకుల్ల దామోదర్ రెడ్డి, జిల్లా ఎస్‌పి డి జానకి, డిసిసి బ్యాంక్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, అచ్చంపేట, మక్తల్, వనపర్తి, షాద్‌నగర్ ఎంఎల్‌ఎలు వంశీకృష్ణ, వాకిటి శ్రీహరి, మేఘా రెడ్డి, వీర్లపల్లి శంకర్, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

రైతు పండుగలో ఆకట్టుకున్న 150 స్టాళ్లు
ప్రజా పాలనలో భాగంగా గురువారం నుంచి ఈనెల 30 వరకు జిల్లా కేంద్రంలో చేపట్టిన రైతు పండుగ కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రైతు పండుగ కార్యక్రమాన్ని మంత్రులు తుమ్ముల నాగేశ్వర్ రావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఆధునిక వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు, ఆహార పదార్థాలు, ఎరువులు, విత్తనాలు, నూతన వంగడాలు, డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయ డ్రోన్లు, మినీ ట్రాక్టర్లు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎద్దులు, పొట్టేళ్లు, కోళ్లు, మేకపోతులు, పండ్ల పెంపకం, పూల తోటలు, చేపల పెంపకం వంటి దాదాపు 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. సేంద్రియ వ్యవసాయం, ఆధునిక పద్ధతుల్లో లాభసాటి వ్యవసాయం చేసేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, మేధావులు రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఆడిటోరియం వంటివి రైతులకు విశేషంగా ఆకట్టుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News