Sunday, April 28, 2024

రోజుకో సూర్యుడ్ని స్వాహా చేసే రాకాసి కృష్ణబిలం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అత్యంత వేగంగా పెరుగుతోన్న , దేదీప్యమాన ప్రకాశవంతమైన భారీ కృష్ణబిలాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ పరిశోధకులు దీన్ని కనుగొన గలిగారు. నక్షత్ర మండలంలో అత్యంత క్రియాశీల , దేదీప్యమాన కేంద్ర భాగాలను క్వాసార్లుగా పేర్కొంటారు. ఈ భారీ కృష్ణబిలం క్వాసార్ నడిబొడ్డున ఉంది. ఈ భారీ కృష్ణబిలం రోజూ సూర్యుడంత పరిమాణంలోని పదార్ధాన్ని కబళిస్తోన్నట్టు బయటపడింది.

ఇది రికార్డు స్థాయిలో మన సూర్యుడి కన్నా 500 లక్షల కోట్ల రెట్లు ఎక్కువగా ప్రకాశిస్తోంది. దీన్ని స్వాహా చేస్తోన్న కృష్ణబిలం సూర్యుడి కన్నా 17 వందల కోట్ల రెట్లు పెద్దదిగా ఉంది. ఈ కృష్ణబిలం చుట్టూ వాయువులు సుడులు తిరుగుతూ అంతరిక్ష తుపానును తలపిస్తున్నాయి. ఈ అయస్కాంత తుపాన్ మండలం ఉష్ణోగ్రత 10,000 డిగ్రీల సెల్సియన్ వరకు ఉంటుందని చెప్పారు. ఈ గాలులు సుడులు చాలా వేగంగా ఒక నిమిషం లోనే భూమిని చుట్టి వస్తాయి. ఇది విశ్వం లోనే అత్యంత విస్ఫోటకర ప్రదేశంగా పరిశోధకులు క్రిస్టియన్ వుల్ఫ్ తెలియజేశారు.

ఈ పరిశోధనకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. ఈ క్వాసార్‌ను 1980 నాటి స్కై సర్వేలో యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ గుర్తించింది. అయితే దాన్ని అప్పట్లో ఓ నక్షత్రంగా భావించారు. అది క్వాసార్ అని ఆస్ట్రేలియా, చిలీ లోని టెలిస్కోపులతో పరిశీలించినప్పుడు తాజాగా వెల్లడైంది. అది మనకు 12 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. విశ్వం ఆవిర్భవించిన తొలినాళ్లలో ఇది కూడా ఆవిర్భవించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ అధ్యయనం జర్నల్ నేచర్ ఆస్ట్రానమీలో ప్రచురించినట్టు సహ పరిశోధకులు క్రిస్టోఫర్ ఓంకెన్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News