Sunday, May 5, 2024

ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం పెద్దపల్లి శివారు మంథని ప్లై ఓవర్ వద్ద జిల్లా ఎరువుల నిల్వ కేంద్రంలో ఎరువుల నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు.

వానాకాలం పంటకు ముందస్తుగానే స్టాకు పెట్టుకుని రైతులకు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటుందని అన్నారు. మండలంలోని హన్మంతునిపేట గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులతో కలెక్టర్ మాట్లాడారు. ఆయిల్ ఫాం సాగు వల్ల కలిగే లాభాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, అంతర్ పంటల సాగు వల్ల ప్రతి సంవత్సరం సాధారణ ఆదాయం లభిస్తుందని తెలిపారు.

దీంతోపాటు ప్రభుత్వం అదనంగా ఎకరానికి రూ.4,200 సబ్బిడీని అందిస్తుందని, డ్రిప్ ఇరిగేషన్, మొక్కలకు పెద్ద ఎత్తున సబ్సిడి ప్రభుత్వ కల్పిస్తుందన్నారు. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతూ రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

అనంతరం మండలంలోని అప్పన్నపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎరువుల కేంద్రాన్ని పరిశీలించారు. అవసరం మేర నిలువలు అందుబాటులో ఉంచుకోవాలని ఎరువుల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు. ఆమె వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, జిల్లా హార్టికల్చరల్ ధికారి జగన్ మోహన్ రెడ్డి తదితరులుఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News