Thursday, August 7, 2025

మురికి కాలువలో శిశువు పిండం

- Advertisement -
- Advertisement -

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని వేదం, రెయినో బో పాఠశాలల పక్కన గల మురికి కాలువలో శిశువు పిండం లభ్యమైంది. పట్టణంలోని నర్సింహనగర్ వెళ్లే మార్గంలో పాఠశాల ఎదురు గల కాలువలో శిశువు పిండం లభించింది. మధ్యాహ్నం వేళ అటువైపు పలువురు వెళుతుండగా కొందరు మురికి కాలువలో పిండాన్ని గమనించి పోలీసులకు తెలియజేయడంతో అక్కడికి చేరుకొని మురికి కాలువలో పారవేసిన శిశివు పిండాన్ని బయటకు తీశారు. అక్కడి నుండి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ పిండం 5 నుంచి 6 నెలలు ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News