Tuesday, April 30, 2024

డ్రగ్స్ కేసులో ‘కబాలి’ నిర్మాత అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. కేపీ చౌదరి గత కొంత కాలంగా గోవాలో ఉంటున్నారు. కబాలి చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఇదిలా ఉండగా.. కేపీ చౌదరి డ్రగ్స్ వాడుతున్నట్లు తేలడంతో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు.

కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. పూరీ జగన్నాథ్, ఛార్మి, నవదీప్, రవితేజ, సుబ్బరాజు, తరుణ్, నందు, తనీష్ వంటి పలువురు సినీ ప్రముఖులను ఈడీ విచారించింది. చివరకు వీరంతా డ్రగ్స్ వాడలేదని ఫోరెన్సిక్ రిపోర్టు రావడంతో అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. తాజాగా ఈ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News