Thursday, May 2, 2024

నిరుపేద మహిళ వైద్యానికి ఆర్థిక సహాయం

- Advertisement -
- Advertisement -

మౌలాలి : బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఓ నిరుపేద మహిళకు మెరుగైన వైద్య చికిత్స కోసం మౌలాలి కార్పొరేటర్ గున్నాల సునిత శేఖర్ యాదవ్ తన స్వంతంగా రూ.20 వేల ఆర్ధిక సహాయం అం దించి మరో మారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆర్ధికంగా చితికి పోయిన వారికి ఎల్ల వేళలా తాను అండగా ఉంటానంటూ వారి తన చేతనయిన రీతిలో తన సొంతడబ్బును వెచ్చింది సహాయం అందచేస్తున్న కార్పొరేటర్ ఇదే బాటలో ముందుకు నడిచారు. వివరాలిలా ఉన్నాయి. మౌలాలి డివిజన్ పరిధిలోని సంతోషిమాత కాలనీకి చెం దిన కళావతి యోగ టీచర్.

యోగపై ఆసక్తి ఉన్న వారికి ఆమె, ఉచితంగా యోగలో మెళుకువలు నేర్పిస్తుంది. మం చి వారికే అన్ని కష్టాలు చుట్టుముడతాయనే నానుడి ప్రకారం… విధి వక్రీకరించి ఇటీవల ఆమె అనారోగ్యం బారిన పడింది. ఈ క్రమంలో బుధవారం యోగ నేర్పిస్తున్న స మయంలోనే ఆమెకు బిపి పెరిగి కింద పడి పోయింది. వెంటనే పక్షవాతం వచ్చింది. బాధితురాలను స్ధానిక సూర్య ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్ధితి విషమంగా ఉంవదని అక్కడి వై ద్యులు చెప్పడంతో మెరుగైన వైద్య చికిత్సం కోసం నగరంలోని యశోధ ఆసుపత్రికి తరలించారు. రెండు చోట్ల బ్రెయిన్ సర్జరీలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News