Monday, May 6, 2024

బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపిన కాంట్రాక్ట్ టీచర్లు

- Advertisement -
- Advertisement -

తార్నాక: ముఖ్యమంత్రి కెసిఆర్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొ ఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని ఓయు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జె ఎసి చైర్మన్ డా.ఎ.పరుశరామ్ పేర్కోన్నారు. ఈ మేరకు బుధవారం ఓయు ఆర్ట్ కళాశాల వద్ద తెలంగాణ సాంస్కృతికి సాంప్రదాయనికి ప్రతీక అయిన బతుకమ్మ కార్యక్రమంతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జునియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసిన విధంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 యునివర్శిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలోని యునివర్శిటీలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెం ట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేశారని తెలిపారు. అనంతరం జెఎసి మహిళా నాయకురాలు డా.జయశ్రీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని బతుకమ్మ పండుగను నిర్వహిస్తారని,అలాగే కాం ట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయడం ద్వారానే తమకు సం తోషం కలుగుతుందని అన్నారు.

డాక్టర్ శైలజారెడ్డి మాట్లాడుతు ఎన్నో సంవత్సరాలుగా యునివర్శిటీలలో బోదన పరిశోదన రంగాల్లో పనిచేస్తూ సేవలందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైన సిఎం కెసిఆర్ తమ సేవలను గు ర్తించి రెగ్యులరైజ్ చేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చే స్తామ ని తెలిపారు. కార్యక్రమంలో జెఎసి కన్వీనర్ డా.దర్మతేజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News