Saturday, September 21, 2024

కాంగోకు వచ్చే వారం తొలి విడత ఎంపాక్స్ వ్యాక్సిన్లు

- Advertisement -
- Advertisement -

ఎంపాక్స్ కేసులు ఉన్న 12పైగా ఆఫ్రికా దేశాల్లో కాంగో ఒకటి
ఆఫ్రికాలో గ్లోబల్ ఎమర్జన్సీ ప్రకటించిన డబ్లుహెచ్‌ఒ

కిన్షాసా (కాంగో) : కాంగో అమెరికా నుంచి వచ్చే వారం తొలి విడత ఎంపాక్స్ వ్యాక్సిన్లు అందుకుంటుందని కాంగో ఆరోగ్య శాఖ మంత్రి రోజర్ కంబా వెల్లడించారు. ఆఫ్రికాలో ఎంపాక్స్ కేసుల వ్యాప్తిని ప్రపంచ ఎమర్జన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ హు) ప్రకటించిన కొన్ని రోజుల తరువాత కాంగో వాటిని అందుకోనున్నది. డజనుకు పైగా ఆఫ్రికన్ దేశాల్లో పిల్లలు, వయోజనుల్లో ఎంపాక్స్ కేసుల ధ్రువీకరణ జరిగింది. వైరస్ కొత్త రకం వ్యాపిస్తోంది.

ఆ ఖండంలో కొన్ని డోసుల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కాంగోలో అధిక సంఖ్యలో ఎంపాక్స్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశానికి 30 లక్షల వ్యాక్సిన్ డోసులు అవసరం. వ్యాక్సిన్లు దానంచేసేందుకు అమెరికా, జపాన్ సంసిద్ధత చూపాయని రోజర్ కంబా విలేకరులతో చెప్పారు. ఎన్ని డోసులు పంపిస్తారో, జపాన్ నుంచి ఎప్పుడు వస్తాయో ఆయన చెప్పలేదు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 17 వేలకుపైగా ఎంపాక్స్ కేసులు, 500 పైగా మరణాలు ఉన్నట్లు డబ్లుహెచ్‌ఒ తెలిపింది. అన్ని కేసులు, మరణాల్లో 96 శాతంపైగా కాంగోలోనే నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News