Saturday, September 21, 2024

ఢిల్లీ ఆస్పత్రులకు బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ తదితర 50 ప్రభుత్వ ,ప్రైవేట్ ఆస్పత్రులతోపాటు ఒక మాల్‌కు మంగళవారం ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. నన్‌గ్లోయిలోని ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 1.04 గంటలకు , చాణక్యపురి లోని ప్రైమస్ ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 1.07 గంటలకు తమకు సమాచారం అందిందని ఢిల్లీ ఫైర్‌సర్వీస్ అధికారి చెప్పారు. అగ్నిమాపక వాహనాలు, బాంబు తనిఖీ బృందాలు, పోలీస్‌లు ఆయా ప్రాంతాలకు వెళ్లి తనిఖీ చేపట్టారని అయితే ఇంతవరకు ఎలాంటి అనుమానాస్పదమైనవి కనిపించలేదని అధికారులు చెప్పారు. మిగతా ఆస్పత్రుల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బాంబు బెదిరింపు కాల్స్ అందుకున్న వాటిలో అపోలో, మూల్‌చంద్, మాక్స్ అండ్ సర్‌గంగారామ్ ఆస్పత్రి కూడా ఉన్నాయి.

మధ్యాహ్నం 12.04 గంటలకు అందిన జిమెయిల్‌లో “మీ భవనం లోపల అనేక పేలుడు పదార్థాలను అమర్చాం. నల్లని కవర్లలో అవి ఉన్నాయి. కొన్ని గంటల్లో అవి పేలబోతున్నాయి” అని హెచ్చరించి ఉంది. “మీరు రక్తపు మడుగులో అంతం కానున్నారు. మీలో ఏ ఒక్కరూ మిగలరు. భవనం లోని ప్రతివ్యక్తి ప్రాణాలు కోల్పోతారు. మానవాళికి స్కామ్ తప్ప నాకు మరేమీ లేదు. ఈరోజు భూమిపై మీ ఆఖరి రోజు” అని ఆ జిమెయిల్‌లో హెచ్చరించి ఉంది. ఈ మెయిల్‌లో “సిఒయుఆర్‌టి పేరుగల గ్రూపు ఈ నరమేథం వెనుక ఉంది. ఉగ్రవాదాన్ని తాము ఆపలేం. న్యూస్ అవుట్‌లెట్స్‌కు గ్రూప్ పేరు ఇవ్వండి” అని ఉంది. ఈ బెదిరింపు ఈ మెయిళ్లు ఇదివరకు ఆస్పత్రులకు, స్కూళ్లకు, యూనివర్శిటీలకు, ప్రభుత్వ భవనాలకు పంపిన బెదిరింపుల మాదిరి గానే ఉన్నాయని పోలీస్ ఆఫీసర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News