Thursday, May 2, 2024

అమెరికాలో మొదటి కరోనా రీఇన్‌ఫెక్షన్ కేసు

- Advertisement -
- Advertisement -

అమెరికాలో మొదటి కరోనా రీఇన్‌ఫెక్షన్ కేసు
హాంకాంగ్ యువకుని కేసుకు ఇది భిన్నం

First corona reinfection case in Hong Kong

వాషింగ్టన్ : రెండోసారి కరోనా సోకడంపై ఆందోళన కొనసాగుతున్న తరుణంలో అమెరికాలో నెవాడా రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల యువకుడికి రెండోసారి వైరస్ సోకినట్టు బయటపడింది. అయితే ఇదింకా పూర్తిగా ధ్రువీకరించాల్సి ఉంది. హాంకాంగ్‌లో అధికారికంగా తొలి రీ ఇన్‌ఫెక్షన్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఐరోపా లోని అనేక దేశాల్లో రెండోసారి వైరస్ సోకినట్టు వార్తలు వచ్చాయి. హాంకాంగ్‌లో రెండోసారి వైరస్ సోకిన యువకునికి లక్షణాలేవీ కనిపించక పోవడంతో రెండోసారి సోకితే ప్రమాదం పెద్దగా ఉండదన్న అభిప్రాయం కలిగింది. కానీ అమెరికా యువకుని సంగతి వేరు. మొదటిసారి కంటే రెండోసారి తీవ్ర స్థాయిలో లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఏప్రిల్‌లో మొదటిసారి ఈ యువకునికి కరోనా సోకింది. అదే నెల 27 నాటికి ఆ యువకుడు కోలుకున్నాడు. ఆ తరువాత రెండు సార్లు పరీక్షించగా నెగిటివ్ వచ్చింది. ఒక నెల తరువాత ఆ యువకుడు అనారోగ్యం పాలయ్యాడు.

ఈసారి జ్వరం, తలనొప్పి, జలుబు, డయేరియా వంటి లక్షణాలు తీవ్ర స్థాయిలో కనిపించాయి. కృత్రిమంగా ఆక్సిజన్ అందించాల్సి వచ్చింది. పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని వచ్చింది. దీనిపై నెవాడా స్టేట్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీ పరిశోధకులు అధ్యయనం ప్రారంభించారు. మొదటిసారి సోకిన వైరస్ జన్యువులు కన్నా రెండోసారి సోకిన జన్యుక్రమం భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. కరోనా వైరస్‌లో మరోరకం సోకినట్టు కనుగొన్నారు. కాలానుగుణంగా కరోనా మార్పు చెందుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అందువల్ల కొవిడ్ 19 నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ కరోనా సోకదన్న గ్యారంటీ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

First corona reinfection case in Hong Kong

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News