Friday, May 3, 2024

చివరి రోజు ఆట వర్షార్పణం

- Advertisement -
- Advertisement -

First India-England Test ends in a draw

నాటింగ్ హామ్: భారత్, ఇంగ్లండ్ మధ్య నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జిలో జరిగిన తొలి టెస్టు డ్రా అయింది. వరుణుడే ఈ టెస్టును డ్రా చేశాడనడమే సబబుగా ఉంటుంది. చివరి రోజు 157 పరుగుల విజయ లక్ష్యం ఊరిస్తున్న వేళ అకస్మాత్తుగా వచ్చిన వర్షం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది. ఐదో రోజు ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్‌ను వర్షం తుడిచిపెట్టేసింది. నాలుగో రోజు ఆట ముగిసే వేళకు భారత్ ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. దీంతో విజయానికి 157 పరుగులు అవసరం కాగా చేతిలో తొమ్మిది వికెట్లు, రోజంతా ఆట ఉండడంతో విజయం భారత్ సొంమని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా కురిసిన భారీ వర్షం ఐదో రోజు ఆటను అడ్డుకొంది. టీ విరామ సమయం వరకు వేచి చూసినా వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగగా గత 20టెస్టుల్లో భారత్‌కు ఇదిమూడో డ్రా కావడం గమనార్హం. ఈ నెల 12నుంచి లార్డ్‌లో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రాంభమవుతుంది.

స్కోర్లు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 183, భారత్ తొలి ఇన్నింగ్స్ 273, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 303, భారత్ రెండో ఇన్నింగ్స్52/1.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News