Saturday, May 11, 2024

స్టైలిష్, సూపర్ స్మార్ట్ లుక్

- Advertisement -
- Advertisement -

Mahesh babu in Super smart look

 

40 ప్లస్ వయసులోనూ యంగ్ బాయ్‌గా దర్శనమిస్తూ అభిమానులను మురిపిస్తున్నాడు సూపర్‌స్టార్ మహేష్‌బాబు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో ‘సర్కార్ వారి పాట’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సోమవారం మహేష్ బాబు పుట్టినరోజు. అయితే ఒక రోజు ముందే ఆయన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. మహేష్ స్లిక్, స్టైలిష్, సూపర్ స్మార్ట్ లుక్ ఆదివారం బయటకొచ్చింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ‘సర్కార్‌వారి పాట’ టీమ్ మహేష్ బర్త్‌డే బ్లాస్ట్‌ను విడుదల చేసి అభిమానులకు భారీ ట్రీట్ ఇవ్వనున్నారు. ఇక పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News