Tuesday, June 18, 2024

చేప మందు పంపిణీకి బత్తిని కుటుంబం సిద్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8న చేప మందు పంపిణీ చేయనున్నట్లు బత్తిని కుంటుంబం ప్రకటించింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ చేపమందు ఇవ్వనున్నారు. ఈ చేప మందు తీసుకుంటే శ్వాస సమస్యలు, ఉబ్బస (ఆస్తమా) వ్యాధి తగ్గుతుందని ప్రజల నమ్మకం. ఈ చేప మందు ప్రసాదానికి 170 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మందును బత్తిని వంశస్థులు ఉచితంగా అందిస్తూ వస్తున్నారు. ఈ చేప మందును మొదట్లో పాత బస్తీలో పంపిణీ చేసేవారు. కానీ కాలక్రమేణా దీనిని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు మార్చారు. ఈ చేప మందుకు అవసరమయ్యే కొర్రమీను చేప పిల్లలను అక్కడే స్టాల్స్ లో అమ్ముతుంటారు. చేప ప్రసాదం కావాలనుకునేవారు అక్కడే డబ్బులిచ్చి చేప పిల్లలను కొనుక్కుంటే సరిపోతుంది. కానీ ఈ మందు కోసం అనేక ప్రాంతాల నుంచి జనులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కనుక రష్ సమస్య ఉంటుంది.

Fish Medicine 2

Fish 3

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News