Wednesday, October 9, 2024

కాంగోలో వరదలు… 22 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కనంగా : కాంగోలో మంగళవారం కాసాయ్ సెంట్రల్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు, వరదలు ముంచుకు రావడంతో 22 మంది మృతి చెందారు. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి ఇళ్లు, చర్చ్‌లు, రోడ్లు ధ్వంసం కావడంతో పలువురు గల్లంతయ్యారు. ముఖ్యంగా కనంగా ప్రాంతంలో వరదల బీభత్సం ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో గోడలు కూలి పలువురు మృతి చెందారని కనంగా మేయర్ రోస్ మువాది ముసుబే తెలిపారు. డిసెంబర్ తొలి వారం లో కూడా కాంగో లోని బుకావు ప్రాంతంలో భారీ వర్షాల వల్ల 14 మంది మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News