Sunday, April 28, 2024

ఢిల్లీలో కమ్ముకున్న పొగమంచు.. 110 విమానాల రాకపోకలకు అంతరాయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలో పొగమంచు విపరీతంగా కమ్ముకోవడంతో రవాణా సాగడం లేదు. రాజధాని వాసులు రాకపోకలు సాగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది . చలి తీవ్రంగా ఉండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించడం లేదు. గాలి నాణ్యత కూడా పడిపోయింది.

ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు తగ్గింది. పొగమంచు వల్ల ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 110 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యమౌతున్నట్టు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీకి రావలసిన అనేక విమానాలను దారి మళ్లించారు. రాజధానికి రావలసిన దాదాపు 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే వెల్లడించింది. ఉత్తరాదిన పాటియాలా (పంజాబ్), లఖ్‌నవూ, ప్రయాగ్‌రాజ్‌లో 25 మీటర్ల మేర వరకే కనిపిస్తోంది. ఢిల్లీ,పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో పొగమంచు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News