Thursday, May 2, 2024

లఖీంపూర్ కేసులో మలుపు… కాల్పులు జరిపింది ఆశిష్ మిశ్రానే!

- Advertisement -
- Advertisement -

Ashish Mishra

లక్నో: లఖీంపూర్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తేనీ నాడు కాల్పులు జరిపాడని మంగళవారం ఫోరెన్సిక్ రిపోర్టు స్పష్టంచేసింది. అక్టోబర్ 3న జరిగిన కాల్పుల ఘటనలో ఆశిష్ మిశ్రాతోపాటు అంకిత్ దాస్ కూడా కాల్పులు జరిపినట్లు ఫోరెన్సిక్ రిపోర్డులో తేలింది. నాటి నిరసన ప్రదేశంలో జరిగిని కాల్పులకు సంబంధించిన రిపోర్ట్‌లు పరిశీలించగా ఆశిష్ మిశ్రాకు చెందిన లైసెన్స్‌డ్ తుపాకీ నుంచే ఆ బుల్లెట్లు వచ్చాయని వెల్లడయింది. నిందితుల జాబితా నుంచి ఆశిష్ మిశ్రాను తప్పించేందుకు కేంద్ర మంత్ర అజయ్ మిశ్రా చేస్తున్న ప్రయత్నానికి దీంతో అడ్డుకట్ల పడినట్లయింది.

ఉత్తర్‌ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన సందర్భంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లఖీంపూర్‌లో వందలాది మంది రైతులు నిరసన చేపట్టారు. అదే సమయంలో ఆశిష్ మిశ్రాకు చెందిన కాన్వాయ్ రైతులపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు రైతులు, ఓ జర్నలిస్ట్ సహా ఎనిమిది మంది చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పరిశోధన బృందాన్ని(సిట్) దర్యాప్తు చేసేందుకు ఏర్పాటుచేసింది. సిట్ ఇప్పటి వరకు మంత్రి కుమారుడితో సహా 12 మందిని అరెస్టు చేసింది. ఆశిష్ మిశ్రాకు సహాయపడ్డ అంకిత్ దాస్ కూడా మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ అఖిలేశ్ దాస్ మేనల్లుడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News