Friday, May 3, 2024

నా దృష్టిలో అతనే గొప్ప ఆటగాడు: ఇయాన్ చాపెల్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ కప్- 2013 చివరి దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా- ఆస్ట్రేలియాల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ తో టోర్నమెంటుకు తెర పడుతుంది. ఈ నేపథ్యంలో అభిమానులు కోహ్లీతో ఆసీస్ టాప్ బ్యాట్స్ మన్ స్మిత్ ను పోలుస్తూ, ఇద్దరిలో ఎవరు గొప్ప అనే చర్చను లేవనెత్తారు.

ఇంతవరకూ టీమిండియా ఆడిన పది మ్యాచ్ లలో ఓటమనేదే లేదు. ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. కోహ్లీ ఈ ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసి, అగ్రస్థానంలో ఉన్నాడు. అతను రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలతో 711 పరుగులు సాధించాడు. పైగా న్యూజీలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో తన కెరీర్లో 50వ సెంచరీ చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.

స్మిత్ విషయానికొస్తే, తాజా వరల్డ్ కప్ లో కేవలం 298 పరుగులే చేశాడు. ఇద్దరిలో ఎవరు గొప్ప అనే అంశంపై ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ దిగ్గజం ఇయాన్ చాపెల్ మాట్లాడుతూ తన దృష్టిలో కోహ్లీయే గొప్ప ఆటగాడన్నాడు. ‘ఈ తరం క్రికెటర్లలో అతనే అత్యుత్తమ బ్యాట్స్ మన్. అతను బ్యాటింగ్ చేసే పద్ధతి అద్భుతం. ఇక అతని ఫిట్నెస్ గురించి మాటల్లో చెప్పలేం. కోహ్లీ వయసు 36 ఏళ్లు కావచ్చు కానీ వికెట్ల మధ్య ఎలా పరుగెత్తుతున్నాడో చూడండి. దానికి అతని ఫిట్నెస్సే కారణం’ అంటూ చెప్పుకొచ్చాడు.

‘ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్ కీలకమైన బ్యాటర్. కానీ పూర్తిస్థాయిలో సత్తా చూపించలేకపోతున్నాడు. జట్టులో స్పిన్ ను అతనికంటే బాగా ఆడేవాళ్లెవరూ లేరు. ఫైనల్ లో ఇది కలిసొచ్చే అంశం. అయితే ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్ కూడా కీలకమైన ఆటగాడే’ అని ఇయాన్ చాపెల్ అన్నాడు.

ఇండియా-ఆస్ట్రేలియా జట్లు వరల్డ్ కప్ ఫైనల్ లో తలపడటం ఇది రెండోసారి. 2003లో రికీ పాంటింగ్ నాయకత్వంలోని ఆసీస్, సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా ఢీకొన్నాయి. అప్పుడు టీమిండియాపై ఆస్ట్రేలియా గెలిచి, కప్పును ఎగరేసుకుపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News