Friday, September 13, 2024

డిప్రెషన్‌కు గురయ్యా: మాజీ క్రికెటర్ ఉతప్ప

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టీమిండియాలో చోటు కోల్పోయిన ప్రతిసారి తాను డిప్రెషన్‌కు గురయ్యే వాడినని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. టాలెంట్ ఉన్నా పరిస్థితుల ప్రభావంతో ఉతప్పకు టీమిండియాలో ఆశించిన విధంగా అవకాశాలు రాలేదని చెప్పాలి. టీమిండియా తొలిసారి టి20 ప్రపంచకప్ గెలవడంలో ఉతప్ప కూడా కీలక పాత్ర పోషించాడు.

అయితే నిలకడలేని ఆట కారణంగా అతను భారత జట్టులో శాశ్వత స్థాన్నా సంపాదించడంలో విఫలమయ్యాడు. ఇదే విషయాన్ని ఉతప్ప ఓ కార్యక్రమంలో వెల్లడించాడు. భారత జట్టులో చోటు కోల్పోయిన ప్రతిసారి తాను ఎంతో మనో వేదనకు గురయ్యే వాడినని వివరించాడు. మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచినా తనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కక పోయేవన్నాడు. అప్పట్లో జట్టులో ఉన్న విపరీత పోటే దీనికి ప్రధాన కారణమన్నాడు. కాగా, మానసికింగా కుంగుబాటు ఎదురైనప్పుడు జీవిత ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటుందని ఉతప్ప పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News