Sunday, September 15, 2024

‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా..

- Advertisement -
- Advertisement -

ఎటువంటి పాత్రలోనైనా జీవించగల విలక్షణ నటుడు రావు రమేష్. ఆయన హీరోగా రూపొందిన సినిమా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ పతాకాలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత సమర్పణలో శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నారు.

అభిమానులు, ప్రేక్షకుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించనున్న ఆ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అల్లు అరవింద్ కుమారుడినని, అల్లు అర్జున్ తన అన్నయ్య అని భావించే యువకుడిలా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’లో రావు రమేష్ తనయుడి పాత్ర ఉంటుందని, అందులో అంకిత్ కొయ్య నటించారని దర్శకుడు లక్ష్మణ్ కార్య తెలిపారు. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో సన్నివేశాలను రీ క్రియేట్ చేస్తూ ’మేడం సార్ మేడం అంతే’ పాటను తెరకెక్కించామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News