Tuesday, April 30, 2024

పింకి హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంచలనం సృష్టించిన పింకి హత్య కేసులో నలుగురు నిందితులకు జీవితఖైదు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా విధిస్తూ కూకట్‌పల్లి కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. శేరిలింగంపల్లి, కొండాపూర్‌కు చెందిన పింకి అలియాష్ బింగి అలియాష్ షాలినిని అత్తా, భర్త, బంధువులు కలిసి 30.01.2018లో హత్య చేశారు. ఈ హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నిందితులు మమతా జా, అనిల్ జా ఇద్దరు భార్యభర్తలు, అమర్‌కాంత్ జా(24), వికాస్ కశ్యాప్ అలియాస్ బికాస్ కశ్యాప్, పింకిని వివాహం చేసుకున్నాడు. అందురూ కలిసి బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. మమతా జా, వికాస్ కశ్యాప్ మధ్య వివాహేతర సంబంధం ఉంది.

వీరి సంబంధానికి పింకి అడ్డుగా ఉండడంతో తొలగించాలని ప్లాన్ వేశారు. దానికి అమర్‌కాంత్ జా, అనిల్ జా సహకారం తీసుకున్నారు. ఈ క్రమంలోనే 27.01.2018 రాత్రి 11 గంటలకు పింకితో మమతా జా, అనిల్ జా కావాలనే గొడవపెట్టుకుని ఆమె మెడ, కాళ్లను గట్టిగా పట్టుకోవడంతో వికాస్, అమర్ కాంత్ ఆమె కడుపు, మిగతా శరీర భాగాలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందింది. తర్వాత నిందితులు పింకి మృతదేహాన్ని బాత్‌రూంలో వేసి ముక్కలుగా కోసి పాలితిన్ బ్యాగులో పార్ట్‌లు పెట్టి బొటానికల్ గార్డెన్ వద్ద పేడేశారు. మృతదేహం పడిన విషయం తెలుసుకున్న అప్పటి గచ్చిబౌలి ఇన్స్‌స్పెక్టర్ ఎం. గంగాధర్ సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టంకు పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సాక్షాలను సేకరించి కోర్టులో సమర్పించడంతో నిందితులకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News