Wednesday, May 1, 2024

నవంబర్‌లో రూ.9,000 కోట్ల విదేశీ పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గత రెండు నెలలుగా నికర విక్రేతలుగా ఉన్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐ) నవంబర్‌లో మళ్లి భారతీయ స్టాక్‌మార్కెట్ల వైపు ఆసక్తి చూపారు. గత నెలలో ఎఫ్‌పిఐ పెట్టుబడులు దాదాపు రూ.9000 కోట్లు వచ్చాయి. అమెరికా బాండ్ రాబడిలో క్షీణత, దేశీయ మార్కెట్లు బలంగా ఉండడంతో విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ భారతీయ ఈక్విటీ మార్కెట్లలోకి పెట్టుబడులను కొనసాగించారు. నవంబర్‌లో డెబిట్ మార్కెట్లోకి రూ.14,860 కోట్ల విదేశీ పెట్టుబడులు రాగా, ఇది ఆరు సంవత్సరాల గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో ఎఫ్‌పిఐల స్పందన మార్కెట్ ట్రెండ్‌లో కీలకపాత్ర పోషించనుందని, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ముఖ్యమని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News