Thursday, May 2, 2024

సివిల్స్‌కు బిసి స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ

- Advertisement -
- Advertisement -

Free training in BC Study Circle for Civils

హైదరాబాద్ : యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు తెలంగాణ బిసి స్టడీ సర్కిల్‌లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి తెలిపారు. సివిల్స్ రాయడానికి అర్హత గల బీసీ అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా http://tsbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి 28న స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్ ఫోన్ నంబరు 040 -24071178లో సంప్రదించాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News