Tuesday, April 30, 2024

రేవంత్ రెడ్డి మొక్క కాదు..జిత్తులమారి నక్క: గాదరి కిశోర్

- Advertisement -
- Advertisement -

అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బిఆర్‌ఎస్ నేత, మాజీ ఎంఎల్‌ఎ గాదరి కిశోర్ కుమార్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మొక్క కాదు, జిత్తులమారి నక్క అని విమర్శించారు. ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి అంటున్నారని, అప్పుడు స్థానిక ఎన్నికల కోడ్ రాదా..? అని ప్రశ్నించారు. రేవంత్ జూబ్లీహిల్స్ సొసైటీలో బ్లాక్ మెయిల్ చేసి అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ నేతలు రాజేష్‌కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, పడాల సతీష్, ధర్మారెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరును వాడుకోవడం తప్ప ప్రజలకు ఏమైనా చేద్దామనే ఆలోచన లేదని పేర్కొన్నారు. అమ్మడాలు, కొనడాలు రేవంత్‌కు తెలిసినంత ఎవరికీ తెలియదని అన్నారు. రేవంత్ రెడ్డి తనపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు మోడీతో చీకటి ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించారు.

అందుకే కాంగ్రెస్ పార్టీలో బలహీన అభ్యర్థులను రేవంత్ రెడ్డి పెట్టారన్నారు. వంశీచంద్‌రెడ్డికి ఓటు వేయొద్దని రేవంత్‌రెడ్డి ఫోన్లు చేసి చెబుతున్నారని ఆరోపించారు. 14 ఎంపీలు గెలిపిస్తే ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తా అని మళ్లీ మోసం చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. కెసిఆర్, బిఆర్‌ఎస్ పేరు లేకుండా రేవంత్ రెడ్డి రాజకీయం లేదని చెప్పారు. బిఆర్‌ఎస్ పని అయిపోతే రేవంత్ రోజూ కెసిఆర్ గురించి మాట్లాడడం ఎందుకు అని ప్రశ్నించారు. భారతదేశంలో మోడీతో కొట్లాడే ఏకైక వ్యక్తి కెసిఆరే అని స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని వాళ్ల పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారని అన్నారు. దానం నాగేందర్‌ది జీవితాంతం పార్టీ పిరాయింపులే అని ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరికి పార్టీ ఏం తక్కువ చేసిందని నిలదీశారు. సిట్టింగ్ ఎంఎల్‌ఎను పక్కన పెట్టి కడియంకు కెసిఆర్‌కు టికెట్ ఇచ్చారని,ఆయన కుమార్తెకు ఎంపి టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. కడియం శ్రీహరి మూట ముల్లె తీసుకుని పార్టీ మారారని ఆరోపించారు.

బిజెపి మేనిఫెస్టోలో చెప్పిందే చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని అన్నారు. ఈ పదేళ్లలో బిజెపి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. దేశం 25 సంవత్సరాలు వెనక్కిపోవడానికి బిజెపి కారణమైందని ఆరోపించారు. ప్రశ్నించే వాళ్ళను అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇంకో ఐదేళ్లు 80 కోట్ల పేదలకు ఫ్రీ రేషన్ అని చెప్పి దేశంలో పేదరికం ఉందని మోదీ ఒప్పుకున్నాడన్నారని చెప్పారు. కుల మత ద్వేషాలు రెచ్చకొట్టే పార్టీలను తెలంగాణలో బొందపెట్టాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News