మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ఆరు వరుసల రహదారి
సర్వీస్ రోడ్డు నిర్మాణానికి అంగీకారం
ప్రతిపాదనలు పంపిస్తే ఈ నెలలోనే అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల మంజూరీపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రోడ్లు, భవనా ల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సుదీర్ఘంగా సమావేశమై చర్చించారు. మంత్రితోపాటు తెలంగాణ ఎంపిలు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపి జితేందర్ రెడ్డిలు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న పలు రహదారులకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వినతిప త్రం అందించారు. కేంద్రమంత్రి గడ్కరీతో సమావేశం పై మంత్రి కోమటిరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఉప్పల్ ఫ్లైఓర్ పనులపై నిరంతరం పర్యవేక్షిస్తున్నానని, వీటితో రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రహదారుల అందించేందుకు హ్యామ్ విధానంలో ఇప్పటికే రోడ్లను ఎంపిక చేశామని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. మల్కాపూర్ నుంచి విజయవాడ (అమరావతి) వరకు రహదారిని 4 వరుసల నుంచి 6 వరుసలుగా విస్తరించడంతో పాటు స ర్వీస్ రోడ్లను నిర్మించాలని గడ్కరీని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. డెత్ రోడ్డుగా పిలిచే హైదరాబాద్- టు విజయవాడ రహదారిపై (ఎన్‌హెచ్-65) జూ లై 27 న జరిగిన ప్రమాదంలో ఏపికి చెందిన ఇద్దరు డిఎస్పీల మృతి చెందిన విషయాన్ని గడ్కరీ దృష్టికి మంత్రి కోమటిరెడ్డి తీసుకెళ్లారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తిపై సానుకూలంగా గడ్కరీ స్పందించారు. ఆగష్టు 15 వ తేదీన నిర్వహించే ఫైనాన్స్ మీటింగ్‌లో ఎన్‌హెచ్-65 విస్తరణకు ఆమోదిస్తామని త్వరితగతిన అంచనాలు రూపొందించి పంపాలని, వెంటనే టెండర్లు పిలుస్తామని గడ్కరీ హామీనిచ్చారు.
ఆరు వరుసల రహదారిగా రీజనల్ రింగ్‌రోడ్డు
రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూ సేకరణ పూర్తి చేసిన విషయాన్ని గడ్కరీతో మంత్రి కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. వీలైనంత త్వరగా ప నులు ప్రారంభించాలని గడ్కరీని మంత్రి కోరారు. 4 వ రుసలుగా నిర్మించాలనుకున్న రీజనల్ రింగ్‌రోడ్డు ను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 6 వరుసలు గా నిర్మించేందుకు ఎస్టీమేషన్లు మాడిఫై చేస్తున్నామని, టెండర్లను సైతం అందుకు అనుగుణంగా ఫైనలైజ్ చేస్తమని గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం ఇండస్ట్రీయల్ కారిడార్‌గా రూపుదిద్దుకొనున్న నేపథ్యంలో వేగంగా పనులు చేపడితే అనుకున్న వ్యయంలోనే భూసేకరణ పూర్తవుతుందని, ఆలస్యం జరిగితే భూ సేకరణకు ధరలు పెరి గి ప్రాజెక్టుకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వివరించారు. మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తిపై స్పందించిన గడ్కరీ అలైన్‌మెంట్ ప్రపోజల్స్ పంపితే, అనుకున్న దానికన్నా ముందే పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని హామీనిచ్చారు.
ఎల్‌బినగర్-మల్కాపూర్ ఎలివేటెడ్ కారిడార్‌గా
చింతల్‌కుంట చెక్‌పోస్ట్ నుంచి హయత్‌నగర్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు దాదాపు 5 ట కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎలివేటెడ్ కారిడార్‌గా నిర్మించడంతో పాటు నాగ్‌పూర్‌లో మాదిరిగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌గా నిర్మాణం చేపట్టాలని కేంద్రతమంత్రి గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కోమటిరెడ్డి చేసిన విజ్ఞప్తికి గడ్కరీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.హైదరాబాద్ -టు శ్రీశైలం రహదారి టైగర్ రిజర్వ్ నుంచి వెళ్తున్న ప్రాం తాన్ని ఎలివేటెడ్ కారిడార్‌గా గుర్తించాలని మంత్రి కో మటిరెడ్డి విజ్ఞాపనకు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ ఆమో దం తెలిపారు. దీనికి సంబంధించిన అలైన్‌మెంట్‌కు అ ప్రూవల్ ఇస్తామని కేంద్రమంత్రి గడ్కరీ హామీనిచ్చారు. హైదరాబాద్ – టు మన్నెగూడ ఈ రహదారికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్న అంశాన్ని త్వర గా పూర్తి చేసి కాంట్రాక్టర్‌ను ఒప్పించి త్వరితగతిన ప నులు పూర్తిచేయడానికి సహకరించాలని మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి విజ్ఞప్తి చే శారు. వేగంగా అన్ని అంశాలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు. ‘ ఇవే కాకుండా, సేతు బంధన్, సిఆర్‌ఐఎఫ్ నుంచి ప్రపోజల్స్ ఫర్ సాంక్షన్ కు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేయగా వచ్చే వారం ప్ర పోజల్స్ పంపించి మంజూరు చేయించుకోవాలని గడ్కరీ మంత్రి కోమటిరెడ్డికి సూచించారు.