Sunday, April 28, 2024

మేడ్చల్ లో భరోసా కేంద్రానికి గెయిల్ సహాయం

- Advertisement -
- Advertisement -

Gail assists reassurance center in Medchal

 

హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కొత్తగా భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ఏర్పాటు చేస్తున్న గెయిల్ ఈ మేరకు మంగళవారం నాడు పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగం అడిషనల్ డిజి స్వాతీ లక్రా, డిఐజి సుమతి, గెయిల్ ఇండియా జోనల్ జనరల్ మేనేజర్ శరద్ కుమార్, డిజిఎం సురేష్ బాబు ల మధ్య ఎం.ఓ.యుపై ఒప్పందం కుదుర్చుకుని సంతకాలు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరిలో రూ. 10 లక్షల వ్యయంతో గెయిల్ కొత్తగా నిర్మించిన భరోసా కేంద్రం భవనం 2022 మర్చి లో అందుబాటులోకి రానుంది. 2022 -2023 రెండు సంవత్సరాలపాటు ఈ భరోసా కేంద్రం నిర్వహణకు గెయిల్ రూ. 30 లక్షలను అందిస్తోంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో భరోసా టెక్నీకల్ డైరెక్టర్ డా. మమతా రఘువీర్, గెయిల్ అధికారులు రాజన్న, కుమారా స్వామి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News