గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌లపై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్, పోస్టర్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం 6.03గంటలకు ఈ మూవీ టీజర్ ను లక్నోలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మూవీ టీమ్ లక్నోకు చేరుకుంది. లక్నోతోపాటు 11 చోట్ల టీజర్‌ను అభిమానుల సమక్షంలో విడుదల చేస్తుండటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
#GameChangerTeaser IS ALL SET
Enjoy this Blasting Promo until the OverSized One Comes To set a new record
#GameChanger
pic.twitter.com/kbcYQLEEtx
— thaman S (@MusicThaman) November 8, 2024